చింత చెట్టును తొలగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

June 17, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 17 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలోని భూమి సర్వే నంబర్ 103 సివిల్ కోర్టు కేసు నంబర్ 112 ఆఫ్ 2018 కోర్టు కేసులో కొనసాగుతున్న భూమిలోని చింతచెట్టును తొలగించడం చట్ట విరుద్ధంపులుమద్ది గ్రామ నివాసి సయ్యద్ జాఫర్ కుమారుడు సయ్యద్ సుల్తాన్ కలెక్టర్ కు ఫిర్యాదువికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలోని భూమి సర్వే నంబర్ 103 సివిల్ కోర్టు కేసు ( ఐ.ఎ.నం.486 ఆఫ్ 2018, ఓ.ఎస్.నంబర్ 112 ఆఫ్ 2018 ) లో కొనసాగుతున్నదని పులుమద్ది గ్రామ నివాసి సయ్యద్ జాఫర్ కుమారుడు సయ్యద్ సుల్తాన్ తెలిపారు. ఆ భూమిలో గత 50 సంవత్సరాల క్రితం నుండి ఒక చింత చెట్టు ఆదాయ వనరులను సమకూర్చుతున్నదని ఆయన అన్నారు. మంగళవారం పులుమద్ది గ్రామ నివాసి సయ్యద్ జాఫర్ కుమారుడు సయ్యద్ సుల్తాన్ మీడియాతో మాట్లాడారు. మా తాతల కాలం నుండి ఉన్న ఆ చింత చెట్టు నుండి చింతచిగురు చింతకాయ చింత గింజలు విక్రయించగా వచ్చే డబ్బులు మా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేదని ఆయన గుర్తు చేశారు. ఆదాయ వనరులను సమకూర్చే చింత చెట్టును దౌర్జన్యంగా అక్రమంగా చట్టాన్ని ఉల్లంఘించి కూకటివేళ్ళతో సహా పూర్తిగా పెకిలించి తొలగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.పూత కాయ కాచే చింత చెట్టును తొలగించిన విషయాన్ని 2026 జూన్ 2 మంగళవారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశామన్నారు. 2026 జూన్ 3 బుధవారం వికారాబాద్ మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు. 2026 జూన్ 8 సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశామని ఆయన వివరించారు ఇప్పటివరకు అటవీశాఖ అధికారులు సివిల్ కోర్టు కేసులో కొనసాగుతున్న భూమిలో ఉన్న చింత చెట్టును తొలగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

🌐 Select Language:
📰 ePaper