చెత్త డంపింగ్ యార్డును తలపిస్తున్న 17వ వార్డు,

జనం న్యూస్ 16 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోని మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్ 17వ వార్డు కౌన్సిలర్ గద్వాల 17వ వార్డులో చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డ్‌గా మారిన ప్రాంతం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 17వ వార్డులో రోడ్డు పక్కన, కాలువ గట్టున చెత్తాచెదారం పేరుకుపోయి డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. పాత బట్టలు, పరుపులు, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.దుర్వాసన కారణంగా చుట్టుపక్కల ప్రజలు, దారిన పోయేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు, పందులు చెత్తను తినడంతో రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలోకి కూడా చెత్త చేరడంతో నీరు కలుషితం అవుతోంది ఈ సమస్యపై 17వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తను తొలగించి, శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు సోషల్ మీడియా కు తెలిపారు.