దేవాలయల కమిటీ అధ్యక్షుడిగా కోటగిరీ కిరణ్

June 16, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూన్ 16, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలం లో గల వేములకుర్తి గ్రామం లో ఈ రోజు దేవాలయల కమిటీ ఎన్నక జరిగింది, ఈ సందర్భంగా దేవాదాయ కమిటీ సభ్యులు కోటగిరి కిరణ్ ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది, ఉపాధ్యక్షుడిగా బుర్రి ముత్యం, కోశాధికారిగా కత్రోజు సాయి కుమార్, దస్తూరి గా గుడ్ల అశోక్, కమిటి సభ్యులు గా తోట రాజాగౌడ్, కుంబాల నారాయణ, రాధారపు లింగం, నేమురి అశోక్, గుడ్ల అశోక్, భూక్యా కైలాష్, మైలారపు గంగాధర్, బక్కి పోషన్న, అరె లష్మినారాయణ, తులి శ్రీధర్, బస మల్లేష్, ధోనికేనా జగదీష్ ని నియమించడం జరిగింది, ఈ సందర్బంగా అధ్యక్షుడు కోటగిరి కిరణ్ మాట్లాడుతూ ఈ రోజు మన దేవాదాయ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం నా జీవితంలో అత్యంత అదృష్టంగా, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పదవిని నేను ఒక అధికారంగా చూడటం లేదు… భగవంతుడికి సేవ చేయడానికి, నాకు లభించిన ఒక గొప్ప భాగ్యం’గా భావిస్తున్నాను.​నన్ను నమ్మి, బాధ్యతను నా భుజాలపై పెట్టిన కమిటీ సభ్యులందరికీ నా మనస్ఫూర్తి గా కృతజ్ఞతలు తెలిపారు,ఈ రోజు నుండి మన ఊరి ఆలయాల ఆలయ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచడానికి, చూడటమే నా మొదటి ప్రాధాన్యత అన్నారు,ఆలయ అర్చక మరియు తోటి కమిటీ సభ్యుల ఆలోచనలతో భక్తుల, దాతల సహకారం మాకు ఎంతో అవసరం అన్నారు, మనమంతా ఒక కుటుంబంలా కలిసికట్టుగా పనిచేసి, మన ఊరి ఆలయాల అన్నిటిని ఒక ఆదర్శవంతమైన కేంద్రంగా తీర్చిదిద్దుకుందాం అన్నారు

🌐 Select Language:
📰 ePaper