జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనం న్యూస్ మే 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారతదేశ నిర్మాణానికి మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ17 సం వత్సరాలు దేశ ప్రధానిగా ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద పరిరక్షణ కోసం నెహ్రూ కృషి చేశారన్నారు. పంచశీల ప్రబోధకుడిగా, అలీనోద్యమ పితామహుడిగా, పంచవర్ష ప్రణాళికల ప్రాణదాతగా చరిత్ర సృష్టించాడన్నారు. నవభారతావనికి శాస్త్రీయ దృష్టి కల్పిస్తూ, శాస్త్ర, సాంకేతిక ప్రగతికి నెహ్రూ పునాదులు వేశారని, సాగునీటి ప్రాజెక్టులు, కర్మాగారాలు ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన దార్శనికుడు నెహ్రూ అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చల్లా చక్రపాణి, డిసిసి ఉపాధ్యక్షుడు పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, నాయకులు చిందం రవి, డీటి రెడ్డి, మామిడిపల్లి సాంబయ్య, మారపల్లి కట్టయ్య, మసికే కుమారస్వామి, పల్లెబోయిన రాజు, వినుకొండ శంకరాచారి తదితరులు పాల్గొన్నారు….