జార్జి క్లబ్ (రి) నూతన పాలకవర్గంను అభినందిస్తున్న కొణతాల,రామకృష్ణ దాడి వీరబద్రరావు. పీలా గోవింద
జనం న్యూస్ ఆగస్టు 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జార్జ్ క్లబ్ కు నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ దాడి బుజ్జి, సెక్రటరీ కొణతాల మురళీకృష్ణ, ట్రజరర్ ఎస్ ఎం నాయుడు, వైస్ ప్రెసిడెంట్ కొణతాల శ్రీను (రాజా దియేటర్ ), జాయింట్ సెక్రటరీ వెదురుపర్తి బాబీ,పాలకవర్గసభ్యులు కొణతాల గంగాధర్, కొణతాల శ్రీను, కర్రి ఆదినారాయణ, బిల్లపాటి గణేష్ గంగరాజు, భీమరశెట్టి పైడయ్య నాయుడు, పావాడ సత్యారావు లు షాలువాలతో సత్కరించి జార్జిక్లబ్ కి అందిస్తోన్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలలో విజయం సాధించినందుకు అందరినీ అభినందిస్తూ.. మంచి టీం వర్క్ తో కలసిమెలసి ముందుకు సాగుతూ, సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ద్వారా క్లబ్ గౌరవాన్ని మరింతగా నిలబెట్టాలని.. నిబంధనలకు అనుగుణంగా క్లబ్ ని నిర్వహించాలని సూచించారు.తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయాని తెలియజేసారు. మాజీ మంత్రి దాడి వీరబద్రరావు మాట్లాడుతూ కబాడీ, వాలీబాల్ లాంటి స్పోర్ట్స్ మరియు నాటిక ప్రదర్శనలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు గతం లో వలే మరింత విజయవంతం గా జరిపించాలని సూచించారు.ఓల్డ్ ఏజ్ పీపుల్ సమావేశాలకు షల్టర్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ గత చరిత్ర ఘనం గా వున్న జార్జిక్లబ్ కి తమ సహాయ సహకారాలు గతం లో వలే ఎప్పటికీ ఉంటాయాని..యోగ, జిమ్ లాంటి కార్యక్రమాల లో ద్వారా క్లబ్ సభ్యులతో పాటు బయటవారికి సేవలాందించడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమం లో జార్జిక్లబ్ పూర్వ ప్రెసిడెంట్ బి ఎస్ ఎం కె జోగినాయుడు పాల్గొన్నారు.