డా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు జూన్ 14
జనం న్యూస్ : 13 జూన్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై.రమేష్ :సిద్దిపేట, జూన్ 13: డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ సి బి సి ఎస్ 6వ, 4వ, 2వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తీసుకు రాగలరు. పరీక్షలు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడతాయి. హాల్ టికెట్లను www.braouonline.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రీజినల్ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం తెలిపారు