త్యాగమూర్తి రమాబాయి ఆశయాలను స్మరిస్తూ – నందికొండలో ఘన నివాళులు

May 27, 2026 | తెలంగాణ

జనం న్యూస్- మే 27- నాగార్జునసాగర్ టౌన్-నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మాత రమాబాయి అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం మరియు ప్రజా సంఘాల నాయకులు రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ సామాజిక, రాజకీయ పోరాటాల వెనుక రమాబాయి అంబేద్కర్ త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు, బాబా సాహెబ్ అంబేద్కర్ విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న సమయంలో ఆమె ఎన్నో ఆర్థిక ఇబ్బందులను, పిల్లల మరణాల వంటి వ్యక్తిగత ప్రాణ సంకటాలను ఎదుర్కొని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు ఈనాడు అడ్డు నిలవలేదని గుర్తు చేశారు. సమాజ మార్పు కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని దారా పోసిన రమాబాయి అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆమె పడిన శ్రమను చేసిన త్యాగాలను భవిష్యత్ తరాలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు,ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు యాదగిరి(యాది), పౌల్ రాజు, జగదీష్, రాజశేఖర్, ప్రమోద్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు కే రామదాసు, భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గణేష్ తంగరాజు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper