నాగార్జునసాగర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్ పి ఎఫ్) ఆధ్వర్యంలో 5 కే రన్
జనం న్యూస్- జూన్ 12- నాగార్జునసాగర్ టౌన్ – స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్ పి ఎఫ్) నాగార్జునసాగర్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం 5 కె రన్ ను నిర్వహించినట్లుగా ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బి రాజు తెలిపారు. ఎస్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, జోన్ డిఐజి మాధవరావు సూచనల మేరకు ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక యాక్షన్ 99 కార్యక్రమంలో భాగంగా పైలాన్ కాలనీ పిల్లర్ నుంచి జెన్కో పార్క్ వరకు 5కే రన్ ను నిర్వహించినట్లుగా ఆయన తెలిపారు, దీనితోపాటు ఫిజికల్ ఫిట్నెస్ కోసం యోగాసనాలు, ఎక్సర్సైజులు నిర్వహించామన్నారు, ఈ కార్యక్రమంలో ఎస్ పి ఎఫ్ సాగర్ డ్యాం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, జెన్కో ఎస్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ నాయుడు, ఎస్ ఐ లు వెంకటేశ్వర్లు, రఘు, ఏ ఎస్ ఐ లు అహ్మద్, యూసుఫ్, పుల్లయ్య, రవీందర్, జెన్కో సాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.