నాగార్జున స్కూల్ ఎదుట ప్రమాదకర గుంత పరిశీలన. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు సూచన

August 1, 2026 | తెలంగాణ

జనం న్యూస్ | ఆగస్టు 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ మాధవరం నగర్ కాలనీలో నాగార్జున స్కూల్ ఎదుట సేవరేజ్ మ్యాన్‌హోల్ దెబ్బతినడంతో రోడ్డుపై ప్రమాదకర గుంత ఏర్పడిన ప్రాంతాన్ని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సేవరేజ్ బోర్డు మేనేజర్ అనిల్‌తో కలిసి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ, సేవరేజ్ మ్యాన్‌హోల్ దెబ్బతినడంతో నీరు రహదారి కింది భాగంలోకి చేరి రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడిందన్నారు. దీంతో వాహనదారులు, పాదచారులు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని దెబ్బతిన్న సేవరేజ్ మ్యాన్‌హోల్‌కు అత్యవసర మరమ్మతులు చేపట్టి, రోడ్డును యథాస్థితికి తీసుకురావాలని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సేవరేజ్ బోర్డు అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ పరిశీలనలో వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రావు, విజయ్ సాగర్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper