కేజీబీవీలో విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన గ్రామ సర్పంచ్
జనం న్యూస్ ఆగస్టు 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం శాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గ్రామ సర్పంచ్ దాసి స్వాతి- శ్రావణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.అనంతరం విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి చదువులు, ఆరోగ్యం, వసతి తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు….