ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా 138 ఆలయ కమిటీలకు ప్రభుత్వ ఆర్థిక సహాయ నిధుల చెక్కుల పంపిణీ

August 1, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగస్టు 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; తెలంగాణ రాష్ట్ర ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్న ఆర్థిక సహాయ నిధుల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు కూకట్పల్లి నియోజకవర్గంలోని భరత్ నగర్ శ్రీ హరిహర క్షేత్రం ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బండి రమేష్ కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుష్పా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని 138 ఆలయ కమిటీల అధ్యక్షులకు ప్రభుత్వ ఆర్థిక సహాయ నిధుల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. జగజ్జనని అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ముందుకు సాగుతోందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికీ చేరేలా నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గంలోని ఆలయ కమిటీల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper