జలసిరి కార్యక్రమంలో గ్రామ సభ నిర్వహణ – నీటి సంరక్షణ, అభివృద్ధి పనులపై అవగాహన
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం ఆగస్టు 01. 08. 2026 జహీరాబాద్ నియోజకవర్గం జరాసంగం మండలం గినియార్పల్లి గ్రామ పంచాయతీలో శనివారం జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి కుమ్మరి రాజేశ్వరి గోపాల్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.గ్రామంలో ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్, రీఛార్జ్ స్ట్రక్చర్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనుల ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాల పెంపుదల కోసం ప్రభుత్వం చేపడుతున్న జలసిరి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల అమలులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని గ్రామ సభలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, ఉపసర్పంచ్ యాసీన్ అలీ, వార్డు సభ్యులు ఎల్లప్ప, దత్తు రెడ్డి, ఇతర వార్డు సభ్యులు, టీఏ శ్యామయ్య, ఎఫ్‌ఏ జర్నయ్య, ఏఎన్‌ఎం నక్షత్ర, గ్రామ నాయకులు గౌస్, హన్మంత్ రెడ్డి, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.