నిమ్స్ లొ చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

August 14, 2026 | తెలంగాణ

ఎల్ఓసిని బాధిత కుటుంబానికి అందజేసిన సుచిత్రరావు

జనం న్యూస్, ఆగస్టు 14, జగిత్యాల జిల్లా : మెట్‌పల్లి మెట్‌పల్లి పట్టణంలోని సుజిత్ రావు నివాసంలో ఇంద్రనగర్‌కు చెందిన సత్రే మహేష్ కుమార్–కవిత దంపతుల కుమార్తె ఆపరేషన్ నిమిత్తం నిమ్స్‌లో చికిత్స కోసం రూ.2,50,000 విలువైన ఎల్‌ఓసీని అందజేశారు.తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో, టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. అనంతరం సుజిత్ రావు బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు.తమ కుమార్తె చికిత్స కోసం రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి అండగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావుకు సత్రే మహేష్ కుమార్–కవిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు దామెర రాజశేఖర్ రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కొమ్ముల చిన్నారెడ్డి రెడ్డి, పాత దాంరాజ్‌పల్లి ఉపసర్పంచ్ ఇప్పపల్లి గణేష్, సీనియర్ నాయకులు లోక ప్రతాప్ రెడ్డి, మామిడి రాజశేఖర్ రెడ్డి, ఎండి సల్మాన్ ఖాన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper