పెంట్లవెల్లి లో ఆర్ఎంపి డాక్టర్ మల్లయ్య దారుణ హత్య.
జనం న్యూస్ 01 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్య గత 20 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి పెంట్ల వెళ్లిలో ఉంటూ ఆర్ఎంపి జీవనం సాగించేవాడని స్థానికులు చెప్పుకోచ్చారు అయితే శుక్రవారం రాత్రి 8:30 నిమిషాల ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఆరోగ్యం బాగాలేదని మల్లయ్య నిర్వహిస్తున్న క్లినిక్ లోకి వచ్చారు అంతలోనే పథకం ప్రకారమే వచ్చిన ఇద్దరు మహిళలు ఒక్కసారిగా కళ్ళలో కారం కొట్టి మరొక ఇద్దరు రోడ్డుపైకి లాకెళ్లి వేట కొడవళ్ళతో అతి దారుణంగా నరికి చంపారు. మల్లయ్య అక్కడే రక్తపు మడుగుల్లో ప్రాణాలు వదిలాడు అయితే ఈ హత్యకు భూ వివాదాలే కారణం ఉండొచ్చని స్థానికులు చెప్పుకొస్తున్నారు ఈరోజు ఉదయమే కొల్లాపూర్ కోర్టులో హాజరై వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ తరలించారు హత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టలేదని ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపారు