బ్రైట్ పాత్ లెర్నింగ్ సొల్యూషన్ బుక్ స్టాల్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి

August 1, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 01 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; ఈ సందర్భంగా పి డి యస్ యూ జిల్లా అధ్యక్షుడు హరీష్ మాట్లాడుతూ ఐజ మండల కేంద్రంలో బ్రైట్ పాత్ లెర్నింగ్ సొల్యూషన్ పేరుతో నిర్వహిస్తున్న బుక్ స్టాల్‌లో ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యము భాగమై ఉండి పుస్తకాలను అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు సదరు బుక్ స్టాల్‌లో పుస్తకాల ధరలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం తమ ఇష్టానుసారంగా నిర్ణయించి విక్రయిస్తోంది ఉదాహరణకు: LKG – ₹2,650,UKG – ₹2,900,1వ తరగతి – ₹3,251,2వ తరగతి – ₹3,450,3వ తరగతి – ₹3,570,4వ తరగతి – ₹4,120,ఈ విధంగా విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతూ పుస్తకాలను విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే బ్రైట్ పాత్ లెర్నింగ్ సొల్యూషన్ బుక్ స్టాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని, అవసరమైతే స్టాల్‌ను సీజ్ చేయాలని కోరుతున్నాము.

🌐 Select Language:
📰 ePaper