పేదలకు గొప్ప వరం సీఎం సహాయనిధి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్

July 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 10 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా )పేదలకు గొప్ప వరం సీఎం సహాయ నిధి అని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, అన్నారు. శుక్రవారం రోజున మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన పెద్దమ్మల అశోక్, కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురి కాగా వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కును జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి 52,000 రూపాయల చెక్కును ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆదేశాల మేరకు బాధితుని ఇంటికి వెళ్ళి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో నేరుగా బాదితులకు ఇంటివద్దనే చెక్ అందించాలని నూతన ఒరవడికి షబ్బీర్ అలీ, శ్రీకారం చుట్టారని ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాకు సీఎం సహాయ నిధి చెక్కు గొప్ప వరమని మా ఇంటికే వచ్చి చెక్ అందించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి, కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రోడ్డ రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్ద రాజిరెడ్డి, చింతకుంట రాజు రెడ్డి, రంగు శ్రీనివాస్, చింతర్ల రాజిరెడ్డి,బొంద శివ, శ్యామ్ లాల్ , వడ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper