ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు
జనం న్యూస్ మే 30 చిలిపి చెడు మండలం ప్రతినిధిమెదక్ జిల్లాచిలిపిచెడ్ మండలంలోని ఫర్టిలైజర్ దుకాణదారుల షాపులను మండల టాస్క్ ఫోర్స్ కమిటీ తనిఖీ చేయడం జరిగింది. మండల టాస్క్ ఫోర్స్ కమిటీ నందు ఎమ్మార్వో ఎస్సై మరియు ఏవో సభ్యులుగా ఉన్నారు. మండలంలోని ఫర్టిలైజర్స్ షాపుల నందు విత్తనాలు ఎరువులు పురుగుమందుల రిజిస్టర్స్ మండల కమిటీ సభ్యులు తనిఖీ చేయడం జరిగింది . ఈ సందర్భంలో ఎమ్మార్వో మాట్లాడుతూ రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలను, పురుగుమందులను సకాలంలో అందించవలసిందిగా డీలర్స్ కు చెప్పడం జరిగింది, అదేవిధంగా మండల ఎస్సై మాట్లాడుతూ నకిలీ విత్తనాలను అమ్మిన ఎడల చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది, ఏవో మాట్లాడుతూ ప్రతి డీలరు రోజువారి క్రయవిక్రయాలను రిజిస్టర్లో పొందుపరచాలి మరియు అదేవిధంగా స్టాక్ బోర్డును కనిపించే విధంగా ప్రదర్శించాలి, అధిక ధరలకు అమ్మిన యెడల చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జహీర్ ఎస్సై నర్సింలు మరియు ఏవో రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.