బక్రీద్ ఖుర్బాని బీదలపాలిట మహాదానం అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం         

May 27, 2026 | తెలంగాణ

జనం న్యూస్;27 మే బుధవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ ;బక్రీద్ పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు బుధవారం “బక్రీద్ ఖుర్భాని ముబారక్” క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం లాంఛనంగా ఆవిష్కరించారు. పండుగలు సమాజంలో నిస్తేజాన్ని తొలగించి జీవితాలను కళావంతం చేస్తాయి. బక్రీద్ ఈదుల్ జుహ పర్వదినం త్యాగానికి సహనానికి ప్రతీక అనీ పండుగ నాడు ధనవంతులు తమకు కల్గిన సంపదలో బీదలకు రెండున్నర శాతం వస్తురూపేన పంచి అల్లా కృపకు పాత్రులు కావాలని అల్ ఖురాన్ భోదిస్తుందని పండుగ నాడైన బీదవాడు ఆనందంగా కడుపునిండా తినాలని ఇచ్చే “మహాదానం ఖుర్భాని” అంతర్భావ ముఖ్య ఉద్దేశం. బక్రీద్ ప్రపంచ మానవాళికి బాధలను అధిగమించి త్యాగం, సహజీవనం, ఐక్యత, శాంతి, భద్రతలను సంతోషాలను అందిస్తుందని, అందించాలని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం అందరికి బక్రీద్ పండుగ ముబారక్ తెలియజేశారు ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబీనారుస్తుం, సాధిక్ ఎండి, రహీంరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper