మనబడి మన పండగ కార్యక్రమం పరిశీలన డిఇఓ

June 12, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 12 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖాధికారి వారు పి.నాగేశ్వరరావు *మన బడి – మన పండుగ కార్యక్రమం పరిశీలనలో భాగంగా* కాట్రేనికోన మండలం జడ్పీహెచ్ఎస్ బ్రహ్మ సమేధ్యం పాఠశాలను సందర్శించి, అడ్మిషన్ పొందిన 1 వ తరగతి మరియు 6వ తరగతి విద్యార్థుల వివరాలు అడుగుట జరిగినది. పాఠశాలకు హాజరైన విద్యార్థులందరికీ డీఈవో మండల విద్యాశాఖాధికారి ఎం వెంకటరమణ మరియు ఉపాధ్యాయులచేతుల మీదుగా టెస్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది మరియు స్టాఫ్ మీటింగ్ ఏర్పాటుచేసి 2025-26 విద్యాసంవత్సరం ఎస్ ఎస్ సి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించినందుకు గానూ హెచ్ఎం & స్టాఫ్ ను అభినందించుట జరిగినది మరియు ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్స్ ఇంకనూ పెరిగేలా కృషి చేయాలని సిబ్బందిని కోరారు.అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మెనూ ,క్వాలిటీ & క్వాంటిటీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే డీఈఓ వారి చేతుల మీదుగా విద్యార్థులకు వడ్డించుట జరిగింది అనంతరం జడ్.పి.హెచ్.ఎస్ కందికుప్ప పాఠశాలను కూడా సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించి అందరూ క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని మరియు అందరికీ టెస్ట్ బుక్స్ & నోట్ బుక్స్ ఇచ్చారా? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన చేతులమీదుగా బుక్స్ పంపిణీ చేయడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper