మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం 𝐁𝐑𝐒 పార్టీకి తీరని లోటు

July 31, 2026 | తెలంగాణ

పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి


జనం న్యూస్ జూలై 31, వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గం, ఉద్యమకారుడు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం 𝐁𝐑𝐒 పార్టీకి తీరని లోటని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పేర్కొన్నారు.ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ,తెలంగాణ ఉద్యమంలోనూ, ప్రజాసేవలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి విశేష సేవలు అందించిన నాయకుడని కొనియాడారు.ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడిగా చిరస్థాయిగా గుర్తుండిపోతారని అన్నారు.ఆయన మరణం 𝐁𝐑𝐒 పార్టీతో పాటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.

🌐 Select Language:
📰 ePaper