హెచ్‌పీవీ టీకాకరణపై రాష్ట్ర బృందం తనిఖీ..

July 31, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 31 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; జోగులాంబ గద్వాల్ జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు నిర్వహిస్తున్న హెచ్‌పీవీ టీకాకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర టీకాల తనిఖీ బృందం సభ్యులు డేవిడ్ దమార డా.పృథ్వీరాజ్ గురువారం సందర్శించి పరిశీలించారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు,మల్దకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ధరూర్ కేజీబీవీ పాఠశాలలో టీకాకరణ ప్రక్రియ రికార్డుల నిర్వహణ,అమలు తీరును పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.సంధ్య కిరణ్మై ఆధ్వర్యంలో జిల్లాలో హెచ్‌పీవీ టీకాకరణ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది.14 ఏళ్ల బాలికలకు ఈ టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు.జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి మహమ్మద్ అస్గర్ అలీ మాట్లాడుతూ జిల్లాలో టీకాకు అర్హులైన 7,676 మంది బాలికల్లో ఇప్పటికే 4,197 మందికి టీకా అందించినట్లు తెలిపారు.మిగిలిన అర్హులందరికీ నిర్ణీత గడువులోగా టీకాలు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

🌐 Select Language:
📰 ePaper