మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు జన్మదిన వేడుకలు ఘనంగా
జనం న్యూస్ జూన్ 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు జన్మదిన వేడుకలు గురువారం కూకట్‌పల్లిలోని బాలకృష్ణనగర్‌లో వృద్ధి బ్యాంక్వెట్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై రంగారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, గొట్టుముకుల వెంగళరావు, మందాడి శ్రీనివాసరావు, తూము శ్రవణ్ కుమార్, ఆవుల రవీందర్ రెడ్డి, నవత రెడ్డి, సాయిబాబా, ముద్దాపురం నరసింహ యాదవ్, కూకట్‌పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, గౌసుద్దీన్ తదితరులు పాల్గొని మాధవరం రంగారావుతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ, తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, మహిళా నాయకులు మరియు అభిమానులందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణ, నాయకుల ఆశీస్సులు తనకు మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టుముకుల పెద్ద భాస్కర్‌రావు, భద్రయ్య, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, సంతోష్, ప్రభాకర్, తులసీరావు, ఆనంద్‌రావు తదితరులు పాల్గొని రంగారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడగా, హాజరైన నాయకులు మరియు కార్యకర్తలు మాధవరం రంగారావు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.