మాజీ మంత్రి హరీష్‌రావును కలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గజ్జి శంకర్

June 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్, శాయంపేట, జూన్ 12: శాయంపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గజ్జి శంకర్ శుక్రవారం భూపాలపల్లి పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజ్జి శంకర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలు, నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ శ్రేణులు ప్రజల్లో మరింత చురుకుగా పనిచేసి బీఆర్ఎస్ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని హరీష్‌రావు ప్రస్తావించినట్లు సమాచారం.అనంతరం హరీష్‌రావుతో కలిసి గజ్జి శంకర్ ఫోటోలు దిగారు. పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ మరింత కృషి చేస్తామని గజ్జి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులు పల్లెబోయిన సారయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper