మృతిని కుటుంబానికి ఆర్థిక సాయం
జనం న్యూస్ మే 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని పెద్దకోడపాక గ్రామానికి చెందిన కష్టాల్లో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి సామాజిక సేవకులు అండగా నిలిచారు. పక్షవాతం కారణంగా రెండేళ్లుగా మంచానికే పరిమితమైన అలవాల రాజు కోమాలోకి వెళ్లి ఎనిమిది రోజుల క్రితం మృతి చెందారు. ఆస్తిపాస్తులు లేకుండా జీవిస్తున్న కుటుంబాన్ని భార్య స్వప్న రోజువారీ కూలి పనులు చేస్తూ పోషిస్తున్నారు. ఆమె కుమారుడు రిత్విక్ ఆరో తరగతి చదువుతున్నాడు.కుటుంబ పరిస్థితిని గమనించిన సామాజిక సేవకుడు అమ్మ అశోక్ పరకాల 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారికి సమాచారం అందించారు. స్పందించిన కౌన్సిలర్ కుటుంబానికి 50 కేజీల సన్న బియ్యం, 14 రకాల నిత్యావసర వంట సామాగ్రిని అందజేశారు. సామాజిక సేవకుడు అమ్మ అశోక్ స్వయంగా ఆ సరుకులను కుటుంబానికి అందించారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అమ్మ అశోక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాచమల్ల కృష్ణ, మీడిదొడ్డి తిరుపతి, చెక్క రామ్మూర్తి, నన్నుబోయిన రాజ్‌కుమార్, మామిడి తిరుపతి, కుమార్, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు…..