రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

May 16, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 16 చిలిపి చెడు మండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న “రైతులు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమలో భాగంగా వ్యవసాయ ఇంజినిరింగ్ కళాశాల కంది మండలం సంగారెడ్డి బోధన సిబంది డాక్టర్ లక్ష్మణరావు డాక్టర్ నిమ చిల్పిచేడ్ మండలంలోని గౌతపూర్ గ్రామంలో 15.05.2026 నాడు అన్నదాతలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, పంటలలో యూరియా మరియు రసాయన ఎరువులను వాడకం తగ్గించి పంట ఖర్చును తగ్గించుకోవాలని మరియు జీవ ఎరువులు, పచ్చి రొట్ట మొక్కల పెంపకం మరియు సేంద్రియ పద్ధత్తుల వలన కలిగే ప్రయోజనాలు, భూ సార పరీక్ష ఆవశ్యకత వివరించడం జరిగింది. నీమా మాట్లాడుతూ పంట మార్పిడి వల్ల జరిగే మేలు, నీటి ఆదా చేయడం మరియు మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలలు మరియు వరిలో చీడ పీడల యాజమాన్యం పై చర్చించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారి కృష్ణవేణి మార్కెట్లో లభిస్తున్న పచ్చి రోట్ట మొక్క రకాలు మరియు పామ్ ఆయిల్ పంట సాగు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బలవత్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ నమ్య నాయక్ రైతు సహకార సంగం అధ్యక్షులు యాసిన్ రైతులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper