రైతు వేదికలలో విత్తన మేళా – రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు

June 23, 2026 | తెలంగాణ


జనం న్యూస్ జూన్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 23-06-2026 నుండి 30-06-2026 వరకు ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి మండలంలోని రైతు వేదికలలో విత్తన మేళా రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు కార్యక్రమం నిర్వహిస్తారని మండల వ్యవసాయ అధికారి ఏం ప్రియదర్శిని తెలిపారు.ఈ విత్తన మేళాలో రైతులకు నాణ్యమైన, ధృవీకరించబడిన వరి విత్తనాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ముఖ్యంగా క్రింది ఏడు రకాల సన్న వరి విత్తనాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌కు అర్హత కలిగిన రకాలు అందుబాటులో రైతులకు ఉంటాయని తెలిపారు. లోబిపిటి-5204 (బీపీటీ-5204) ఆర్‌ఎన్‌ఆర్-15048 (ఆర్ ఎ ఆర్ -15048)కెఎన్‌ఎం-1638 (-1638)కెఎన్‌ఎం-7715 (కేఎన్ఎం-7715)జై శ్రీరామ్ (జై శ్రీ రామ)హెచ్‌ఎమ్‌టి సోనా (ఎచ్ ఎం టీ సోనా)డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి) వరంగల్-44 (సిడ్స్)]అదనంగా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నానో యూరియా, నానో డీఏపీ తో పాటు వివిధ రకాల పప్పుధాన్యాల విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.రైతులు ధృవీకరించబడిన, నాణ్యమైన విత్తనాలను వినియోగించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించడంతో పాటు, ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉందని అన్నారు.శాయంపేట మండలంలోని రైతులందరూ తమ సమీప రైతు వేదికను సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నాణ్యమైన వరి విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ పప్పుధాన్యాల విత్తనాలను పొందవలసిందిగా మండల వ్యవసాయ శాఖ అధికారి తెలియజేశారు…

🌐 Select Language:
📰 ePaper