వర్షాలు కురవాలని కప్పకు ప్రత్యేక పూజలు
జనం న్యూస్, జూలై 14,అచ్యుతాపురం : మండలం లోనిహరిపాలెం అందాలపల్లి గ్రామంలోని పెద్దలు పిల్లలు కలిసి కప్ప కప్ప నీలాలు అడి గ్రామంలో కప్పతో వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ వరుణ దేవుని ప్రార్థిస్తూ వానలు కురవాలి వానదేముడా వరిచేలో పండాలి వానదేవుడా అంటూ పాటలు పాడుతూ గ్రామంలో ప్రతి ఇంటి నుండి కడవలు బిందువులతో నీళ్లు తెచ్చి మహిళలు కప్ప పైన పిల్లలపైనా నీళ్లు పోసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా ఎలమంచిలి సబ్ డివిజన్ కన్వీనర్ బివి రమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికతో పాటు సైన్స్ కూడా ఇమిడి ఉందని,కప్ప పిల్లల పైన కడవలతో వేసిన నీటిలో వీధులు జలమై ఎండకు ఆవిరై మేఘాలుగా ఏర్పడి వర్షాలు కురిపిస్తాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో శరగడం భాగ్యనాయుడు,పిల్లా వెంకటప్పరావు, పోలీస్ నాయుడు, బలరాం, నవీన్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.