వాల్మీకి మహర్షి ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవానికి హాజరైన

May 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 25 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయం చైర్మన్ నీలి శ్రీనివాసులు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలో నల్లకుంట కాలనీలోనీ వాల్మీకి భవన్ నందు జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన వాల్మీకి విద్యార్థుల నగదు ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవానికి వాల్మీకి నాయకులతో కలిసి నీలి శ్రీనివాసులు హాజరై బహుమతులను ప్రధానం చేసి విద్యార్థిని విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసు మాట్లాడుతూ ప్రతి వాల్మీకి బిడ్డ ఎదగాలి సమాజంలో గుర్తింపు పొందాలి తల్లిదండ్రుల ప్రతిష్టను పెంచాలి సమాజంలో వాల్మీకులకు వృత్తి లేదు చదువే ఒక వృత్తిగా గుర్తింపు పొందాలి అని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో వాల్మీకి కమిటీ సభ్యులు ఉద్యోగ సంఘం నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper