కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ మే 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సామాజిక న్యాయం పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి పని చేస్తున్న నాయకులు మహేష్ కుమార్ గౌడ్ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేకు కోసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐ ద్వారా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలందించి పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించారన్నారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై అనంతరం టి పి సి సి అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారన్నారు ఆత్మ గౌరవ స్థానాన్ని రాజకీయ వేదికపై వినిపిస్తూ సామాజిక సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పోలేపల్లి శ్రీనివాసరెడ్డి మారెపల్లి రవీందర్ పత్తిపాక సర్పంచ్ గజ్జి ఐలయ్య చిందం రవి వైనాల కుమారస్వామి. నిమ్మల రమేష్ బోనపల్లి రఘుపతి రెడ్డి మారపల్లి వరదరాజు కటయ్య మస్కే కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు…