వినియోగదారుల మనసులు గెలుచుకుంటేనే వ్యాపార విజయాలు సాధ్యం: బండి రమేష్

June 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వినియోగదారులు మెచ్చే విధంగా, వారికి నచ్చేలా నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తే వారి విశ్వాసాన్ని సంపాదించడంతో పాటు విజయాలను సైతం అందుకోవచ్చని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పేర్కొన్నారు.గాజులరామారంలో బాబు, మహేష్, నరేష్, అభినయ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “ద బేక్ హౌస్ స్వీట్ షాప్”ను సోమవారం బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార రంగంలో వినియోగదారుల సంతృప్తే ప్రధానమని, నాణ్యత, విశ్వసనీయత, మర్యాదపూర్వక సేవలతో ప్రజల ఆదరణ పొందవచ్చని అన్నారు.
స్థానికంగా నూతన వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం ఉపాధి అవకాశాలకు దోహదపడటమే కాకుండా ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యాపార సంస్థ నిర్వాహకులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ఉత్తమ ప్రమాణాలను పాటించాలని సూచించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి దినేష్ కుమార్, యాక నారాయణ, వినోద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
కొత్తగా ప్రారంభమైన “ద బేక్ హౌస్ స్వీట్ షాప్” విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ పలువురు స్థానిక ప్రముఖులు, పార్టీ నాయకులు తమ అభినందనలు తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper