శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివాస్) సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు
జనం న్యూస్ జూన్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ఒక్కటే దేశం ,ఒక్కటే రాజ్యాంగం ,ఒక్కటే జెండా ఉండాలనే సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ జనసంఘ్ వ్యవస్థాపకులు, జీవితమంతా దేశ ఐక్యత కోసం పోరాడిన మహనీయుడు డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ( బలిదాన్ దివాస్) సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ ,పటేల్ కుంట పార్క్ ఎదురుగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద వారి చిత్ర పటానికి బీజేపీ శ్రేణులతో కలిసి నివాళులర్పించిన.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దేశమంతా ఒక్కటిగా ఉండాలని పోరాడిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ని, ఒక్కటే దేశం ,ఒక్కటే రాజ్యాంగం ,ఒక్కటే జెండా, ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదు అనే సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు, భారతదేశ ఐక్యత కోసం, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోనే ఉండాలని ఆయన చేసిన పోరాటం వలనే, మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి భారత్ కలపడం జరిగిందని గుర్తు చేశారు, ఆయన చేసిన త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, దేశ ప్రయోజనాలే ముఖ్యంగా ముఖర్జీ చూపిన మార్గంలో నడవాలని, ఆయన ఆశయ సాధనకు మనమంతా దేశ అభివృద్ధి కోసం, జాతీయతాభావాన్నీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు,ఈ కార్యక్రమంలో కేశవులు, రామరాజు, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, వెంకటస్వామి రెడ్డి, రామ్ రెడ్డి, స్రవంతి, దుర్గా ప్రసాద్, వంశీ రెడ్డి, బాలు యాదవ్, నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, గోపాల్ రావు, శ్రీహరి యాదవ్, కనకయ్య, అంజయ్య యాదవ్, వీరు యాదవ్,సునీల్ రెడ్డి, సైదమ్మ, జ్యోతి, రఘు, సందీప్, సురేష్ ,చాంద్ మొదలగు వారు పాల్గొన్నారు.