స్కూల్ బస్సుల ఫిట్నెస్‌పై రవాణా శాఖ దృష్టి పెట్టాలి

June 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 15 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ :జోగుళాంబ గద్వాల్ జిల్లా..బడులు ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. తమ పిల్లలకు అవసరమయ్యే బుక్స్ నోట్ బుక్స్, డ్రెస్సులు కొనేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యార్థులను తీసుకెళ్లే బడి బస్సుల కండీషన్ పైనే ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా జిల్లాలో ఉండే రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులు తనిఖీ చేయవలసిందిగా జిల్లా ప్రజలు కోరుతున్నారు స్కూల్ బస్సులు పాటించాల్సిన నిబంధనలు 15సంవత్సరాలు దాటిన వాహనాలు విద్యార్థుల రవాణాకు వాడకూడదు స్కూల్ బస్సు పై విద్యాసంస్థ పేరు సెల్ నంబర్,పూర్తి అడ్రస్ ఎడమవైపు ముందు భాగంలో రాయాలి డ్రైవర్లకు 3నెలలకు ఒక సారి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చెయ్యాలి ప్రతి బస్సులో అగ్నిమాపక పరికరం ఉండాలి డ్రైవరుకు విద్యార్థులు బస్సు ఎక్కడం,దిగడం స్పష్టంగా కనిపించేలా అద్దాలు ఉండాలి ప్రతి బస్సులో అటెండర్, స్టూడెంట్స్ పట్టిక ఉండాలి ఫుట్ బోర్డ్ మొదటిమెట్టు 325 మీల్లీమీటర్ల ఎత్తు మించకుండా ఉండాలి

🌐 Select Language:
📰 ePaper