15వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అరిగెల అనుష రాకేష్

June 23, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూన్ 23, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో గల 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ ఆధ్వర్యంలో ఈ రోజు మురికి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 15వ వార్డులోని చావిడి ఏరియాలో స్థానికులు ఎన్నో ఏళ్ళుగా మురికి కాలువ సరిగ్గా లేక, నిలిచిపోయిన మురికి నీటి వల్ల తీవ్ర ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు,ఈ విషయాన్ని నూతనంగా 15వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన అరిగెల అనూష-రాకేష్ దృష్టికి తీసుకెళ్ళగా, ఇదే విషయాన్ని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి తో మరియు వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ తో మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ తో మాట్లాడి ఇట్టి మురికి కాలువ మరియు కల్వర్టు నిర్మాణానికి వారిచే శంకుస్థాపన చేయించడం జరిగినది. వార్డు అభివృద్ధికై కృషి చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు.
ఇన్నేళ్ళుగా నిర్మాణానికి నోచుకోని మురికికాలువ నిర్మాణం ప్రారంభించిన కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ లకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ లు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి , వైస్ చైర్మన్ నవీన్, ఆర్య వైశ్య అధ్యక్షులు మైలారపు రాంబాబు, కౌన్సిలర్ అరిసె వనజ-మురళి, సానిటైజేషన్ మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు..

🌐 Select Language:
📰 ePaper