జనం న్యూస్ అక్టోబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామం గ్రామపంచాయతీలో సఫాయి కార్మికుడిగా పనిచేస్తున్న మంద తిరుపతి ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్లోని సుప్రజా హాస్పిటల్లో చికిత్స పొందుతు గుండె పోటు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందుతూ మరణించారు కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించడం కష్టంగా మారిన విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు అమ్మ అశోక్, దాతలను సంప్రదించి వారి సహకారంతో ₹19,800/-లను సేకరించి మొత్తాన్ని హైదరాబాద్లోని సుప్రజా హాస్పిటల్లో తిరుపతి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరి కి దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.