ధర్నా జయప్రదం చేయండి జనం న్యూస్, అక్టోబర్ 01,అచ్యుతాపురం : భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కొత్త కార్మికుల నమోదు ,పాత వారికి రెన్యువల్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని హరిపాలెం, దోసూరు, అచ్యుతాపురంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చందక రామకృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోమనాయుడు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో కార్మికుల సొమ్ము రూ.4500 రూపాయలు ఉన్నప్పటికీ ఆ డబ్బులు కార్మిక సంక్షేమానికి ఖర్చు చేయడం లేదని ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రమాదంలో అంగవైకల్యం పాలైన కార్మికులకు సహాయం అందించాలని గతంలో ఉన్న సంక్షేమ పథకాలు పునరుద్ధరణ చేయాలని భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ,పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఈ నెల 8వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం అచ్యుతాపురం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ మణికంఠ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు రాజాన అప్పలనాయుడు, దోసూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రమేష్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.