మంత్రి సవితమ్మ ఆదేశాలతో లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లు అందిస్తాం
జనం న్యూస్ అక్టోబర్ 01 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)గోరంట్ల: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ ఉద్దేశమని గోరంట్ల టీడీపీ నాయకులు నిమ్మల శ్రీధర్ అన్నారు.గురువారం గోరంట్ల పట్టణంలో ఎంపీడీఓ కమలాబాయితో కలిసి నిమ్మల శ్రీధర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.ఈ సందర్భంగా నిమ్మల శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలను మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని నిమ్మల శ్రీధర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్టోర్ డీలర్ రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.