జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా గినియార్పల్లి గ్రామంలో సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, నీటి సంరక్షణ అంశాలపై సభలో చర్చించారు. గ్రామంలో ముంపు కాలువల అభివృద్ధి, చెక్డ్యామ్లలో పూడికతీత, ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర పనులను గుర్తించి చేపట్టాలని నిర్ణయించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. నీటి వనరుల పరిరక్షణ, వర్షపు నీటి ఒడిసిపట్టుకు ఇంకుడు గుంతల ఏర్పాటు, కాలువల్లో పూడికతీత ద్వారా భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాసీన్ అలీ, గ్రామ కార్యదర్శి రాజు, క్షేత్ర సహాయకుడు జర్నయ్య, వార్డు సభ్యులు దత్తు రెడ్డి, ఎల్లప్ప, లాజర్, శాంతమ్మ, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.