శేర్లింగంపల్లి నియోజక వర్గంలోని వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్‌లో ఉన్న బస్తీ దవాఖానాను సందర్శించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు

May 27, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్‌లో ఉన్న బస్తీ దవాఖానాను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీ దవాఖానాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానాల వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ దవాఖానాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుమారు 60 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేవారని, అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు మరియు ఇతర సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేవారని తెలిపారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించిన ఆయన, గతంలో అందుబాటులో ఉన్న 60 రకాల పరీక్షల్లో ప్రస్తుతం కనీసం 20 రకాల పరీక్షలు కూడా నిర్వహించడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదని అన్నారు.రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్నప్పటికీ, బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి భిన్నంగా ఉందని మాధవరం రంగారావు ఆరోపించారు. గత నాలుగు నెలలుగా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయినప్పటికీ వారు తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎర్ర లక్ష్మయ్య, ఆంజనేయులు, బాబు, శ్రీధర్, రాంబాబు, బీమ్, బాలయ్య, తిరుపతి రావు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper