చెయ్యేరులో బడిబాట
జనం న్యూస్ మే 27 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలోని, జడ్పీహెచ్ఎస్ చెయ్యరు క్లస్టర్ పరిధిలో సావరం, రాయుడుపాలెం, చెయ్యరు మెయిన్, నేతాజీ నగర్ లను బుధవారం మండల విద్యాశాఖ అధికారి-1 నామాల కృష్ణమోహన్ పర్యవేక్షణలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. కాట్రేనికోన మండల విద్యాశాఖాధికారి నామాల కృష్ణ మోహన్, తల్లి దండ్రులతో మాట్లాడి 5 సం. నిండిన విద్యార్థులను జాయిన్ చేసుకొనుట జరిగినది. ఈ కార్యక్రమం లో చెయ్యేరు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టరులు,సిఆర్పి ,అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.