జనం న్యూస్ అక్టోబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గం మోతినగర్ లో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జనసేన రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆలయ ఈఓ నరేందరరెడ్డి రాఘవేంద్రరావు ప్రేమ కుమార్ ని పూలమాలతో మరియు శాలువా తో సత్కరించడం జరిగింది.ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని శబరిమల మేల్శాంతి మాలిగ పురోత్తమ దేవాలయం బ్రహ్మశ్రీ పి.జి. మురళి నంబూద్రి దివ్య సమక్షంలో, వేదమంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, బడే విశ్వేశరరావు, చిట్టి బాబు, రామకృష్ణ మరియు ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.