ప్రధాన పంట కాలువ శుభ్రత బాధ్యత ఎవరిది వైస్సార్సీపీ కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు

May 27, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ మే 27 అమలాపురండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా *అమలాపురం పురపాలక సంఘానికి చేర్చి ఉన్న* *ప్రధాన కాలువ త్రవ్వకం గాని,చెత్తను తొలగించి శుభ్రం చేయడం గాని చేయకపోతే* *ఈ కలుషిత నీరు క్రింద ఉన్న గ్రామాల ప్రజలకు ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశమున్నది*. *దీని పర్యవేక్షణలో ఇరిగేషన్ మరియు మున్సిపాలిటీ సంయుక్తంగా పని చేయాలి.ఇప్పుడు చల్లపల్లి ప్రధాన కాలువ త్రవ్వుతున్న విధంగానే నడిపూడి వరకు పనులు* *కొనసాగించాలని కోరుతున్నాము*.*అదేగాక ఇటీవల నల్లవంతెన నుండి స్మశానంవరకు కాలువ పక్కన వేసిన మట్టి గుట్టలు మరల* *కాలువలోనికి కొట్టుకునిపోయే అవకాశమున్నది*.*ఒకవేళ కాలువ త్రవ్వినా చేసిన పని నిరూపయోగం అయ్యే అవకాశం ఉన్నది. కావున వెంటనే ఈ సమస్యలపై అధికారులు,పాలకులు స్పందించవలసినదిగా కోరుతున్నాము *వంటెద్దు వెంకన్నాయుడు వైస్సార్సీపీ కార్యదర్శి అమలాపురం*

🌐 Select Language:
📰 ePaper