జనం న్యూస్ అక్టోబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలోని మోతీనగర్ డివిజన్, పీఆర్ నగర్లో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపిశెట్టి రఘు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులతో కలిసి బండి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు పొందారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, వాటి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గోపిశెట్టి రాఘవేందర్, సతీష్ గౌడ్, గోపాల్ చౌదరి, లక్ష్మయ్య, బుచయ్య, ఉపేందర్, గంట శ్రీను, ఇందర్జీత్ సింగ్, కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.