శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ మహోత్సవ ఉత్సవాలకు ఆహ్వానం
జనం న్యూస్ మే 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి ప్రాంతంలోని ఎల్లమ్మ బండ శివమ్మ కాలనీలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ వార్షిక మహోత్సవ ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు, సీనియర్ జర్నలిస్టు తెల్ల హరికృష్ణను మాధవరం కాలనీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న మహోత్సవ కార్యక్రమాలకు తమ కుటుంబ సభ్యులతో పాటు వారి బృందం కూడా విచ్చేసి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవాలు భక్తుల ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రాంతీయ ప్రజల్లో ఐక్యతాభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని కమిటీ సభ్యులు తెలిపారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.