కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో అనిల్ కుమార్ యాదవ్

May 29, 2026 | తెలంగాణ

తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

జనం న్యూస్ 29 మే 2026 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుట్టారు. రానున్న పట్టణ ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ తన అమ్ములపొదిలో ఉన్న ఒక్క అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి లో తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ, పార్టీకి అండగా నిలుస్తున్న మరబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అనిల్ కుమార్ యాదవ్ తో స్థానికంగా ఉన్న అనేక విషయాలు తెలుసుకున్నాను. స్వర్గీయ మరబోయిన సత్యనారాయణ యాదవ్ పార్టీకి అందించిన సేవలను రాహుల్ గాంధీ కి వివరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 2018 శేరిలింగంపల్లి లో జరిగిన బహిరంగ సభకు సంబంధించి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఢిల్లీ పెద్దలు కూడా సూక్ష్మంగా గమనిస్తున్నారని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు రాహుల్ గాంధీ వరుసగా అనిల్ కుమార్ యాదవ్ కు కొంత ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ ని ప్రత్యేకంగా కలవడం, వారు నేరుగా తనతో పార్టీ క్షేత్రం స్థాయి విషయాలపై చర్చించడం చాలా సంతోషంగా ఉందని, తన పై మరింత భాద్యతను పెంచిందని, భేటీకి సహకరించిన తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో రాహుల్ గాంధీ ప్రసాద్ కుమార్ తో కలిసి తీసుకున్న ఫొటోను ప్రచురించారు.

🌐 Select Language:
📰 ePaper