అభివృద్ధికి నోచుకోని జహీరాబాద్ మున్సిపాలిటీ
వసూళ్లు మీద ఉన్న బాధ్యత అభివృద్ధిలో ఎందుకు లేదు.
జహీరాబాద్ మే 30 (జనం న్యూస్ ) *మొహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు* అధ్వానంగా మారిన జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా కనీసం చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కారం కు నోచుకోవడం లేదు నగరంలో విద్యుత్ దీపాలు వెలగడం లేదు ప్రధాన రహదారులపై గుంతలను ము డుపడం లేదు చెత్తతో మొరీలు నిండి రోడ్లపై మురికి నీరు ప్రవేశిస్తుంది డ్రైనేజ్ నీటితో రోడ్లన్నీ పాడవుతున్నాయి. ప్రధానంగా నగరంలో చిన్న చిన్న హోటల్ వాళ్లు రోడ్డుపై నీళ్లు వదులుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం టాక్స్ వసూలు పనిలో పడ్డారు ప్రధాన రహదారులపై నిర్మిస్తామన్న ఆలోచన లేదు ఎంతసేపు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా ఆలోచనచేస్తున్నారు కానీ ప్రధానంగా దుమ్ము ధూళి కాలుష్యంపై దృష్టి పెట్టడం లేదు జహీరాబాద్ ప్రాంతంలో కొత్తవారు ఎవరన్నా రావాలంటే భయపడుతున్నారు. ఈ నగరం దుమ్ము ధూళి కాలుష్యంతో ప్రజల కంటి చూపును కూడా కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా రావడం లేదుమున్సిపాలిటీ అభివృద్ధి చెందుతే అక్కడ పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముగిసి మూడు నెలలు అవుతున్నా ఇంతవరకు ఏ కొత్త పనిని కూడా ప్రారంభం చేయలేదు ప్రధాన రహదారులపై కాలువల నిర్మాణం చేస్తేనే రోడ్డు బాగుంటుంది వర్షం నీరు రోడ్డుపై నిలవడంతో రోడంతా పాడవుతుంది రోడ్డు పక్కన రెండు వైపులా ప్రధాన కాలువల నిర్మాణం చేపట్టాలి అప్పుడే రోడ్స్ అన్ని బాగుంటాయి. ఈ దిశగా అడుగులు ఎందుకు వేయడం లేదని పలువురు మున్సిపాలిటీ అధికారులను అడుగుతున్నారు. మీరు నగరాన్నినిర్మించి కనీస ప్రజల సౌకర్యాలను అందించి అప్పుడు టాక్స్ వసూలు చేయండి జహీరాబాద్ స్మార్ట్ సిటీగా రూపొందాలంటే ముందు మున్సిపాలిటీ అధికారులు మారాలి జిల్లా కలెక్టర్ జహీరాబాద్ మున్సిపాలిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలిఫోజులు ఇవ్వడం కాదు మన చుట్టూ జరిగే జహీరాబాద్ ప్రాంత లీడర్ల గొంతు మూగబోయింది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న బడా లీడర్లు జహీరాబాద్ ప్రాంత పెద్ద లీడర్లకు ఫోటోలకు సమస్యకు పరిష్కారం చూపడమే నిజమైన లీడర్ లక్షణం తెలుసుకోండి అంటూ నిలదీస్తున్న మొహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు