నందికొండ మున్సిపాలిటీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యదర్శిగా భూషరాజుల కృష్ణయ్య
జనం న్యూస్- మే 30- నాగార్జునసాగర్ టౌన్-నందికొండ మున్సిపాలిటీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యదర్శిగా నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీకి చెందిన భూష రాజుల కృష్ణయ్యను నియమించినట్లుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కాయితి జానకి రెడ్డి తెలిపారు . నందికొండ మున్సిపాలిటీలో జరిగిన ఒక సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాయితి జానకి రెడ్డి (తెలంగాణ జానకి రెడ్డి) భూష రాజుల కృష్ణయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షులు హీరేకర్ రమేష్ జి, పెదవుర మండల అధ్యక్షులు రెడ్డి నరసింహ, అనుముల మండల అధ్యక్షులు గోపిశెట్టి నరసింహ, నందికొండ మున్సిపాలిటీ అధ్యక్షుడు సభావత్ చంద్రమౌళి నాయక్, దేశ్య నాయక్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.