అయినవిల్లి: కిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఉపాదామి కూలీ బాగోగులు తెలుసుకున్న బాబి మాస్టారు

June 1, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ సూర్యుడు జూన్ 1 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం,కే.జగన్నాధపురం గ్రామానికి చెందిన కమ్మసత్తి అచ్చాయమ్మ, ఉపాధి హామీ పనులు చేస్తూ ఉండగా రక్తపింజర కాటుకు గురై అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని మిద్దె రవి ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్,తాటికోన గ్రామానికి చెందిన జనసేన నాయకులు శిరంగు సత్యనారాయణ గారి సహకారంతో 5000 రూపాయలు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబి మాస్టర్)చేతుల మీదగా ఈరోజు అందించడం జరిగింది.దీనికి గాను బాధితురాలు దాతకు ధన్యవాదాలు తెలిపింది.

🌐 Select Language:
📰 ePaper