తెలంగాణ

జహీరాబాద్ నియోజకవర్గం లో నూతన మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ వీరేశం

జహీరాబాద్ నియోజకవర్గం లో నూతన మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ వీరేశం

జనం న్యూస్ జూన్. 03. 06. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్‌ను ప్రముఖ జర్నలిస్ట్ వీరేశం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై కమిషనర్‌తో చర్చించినట్లు సమాచారం. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించాలని, పట్టణ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని వీరేశం కోరారు. నూతన బాధ్యతల్లో కమిషనర్ విజయవంతంగా పనిచేసి జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు తెలిసింది.

ఇ-పేపర్