మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం
జనం న్యూస్ 10జూన్ పెగడపల్లి ; జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి రోడ్డు నుండి మార్కెట్లోని గోదాం వరకు అంతర్గత సిసి రోడ్డు నిర్మాణం చేయడానికి పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో రోడ్డు నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేపిస్తామని చైర్మన్ రాములు గౌడ్ వివరించారు అలాగే ఈ రబీ సీజన్లో నేటితో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు వివరించారు ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు శాస్త్రవేత్తలు సూచించిన విధంగా పంటలు వేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి స్థానిక సర్పంచ్ ఓరుగల అరుణ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ కార్యదర్శి వరలక్ష్మి డైరెక్టర్లు చెట్ల కిషన్ చాట్ల విజయభాస్కర్ లింగంపల్లి మహేష్ దేశెట్టి లక్ష్మీరాజ్యం మేకల మల్లయ్యశ్రీరామ్ అంజయ్య బాలసాని శ్రీనివాస్ మన్నే గంగరాజు తౌట్ లావణ్య గంగాధర్ మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.