జోగులాంబ గద్వాల జిల్లాలోని విద్యా వాలంటీర్ల” నియామకానికి విజ్ఞప్తి

June 12, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 12 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ని జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో గట్టు కే.టి దొడ్డి రాజోలి ధరూర్ ఐజ మరియు జిల్లాలోని ఇతరమండలాలలో ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక విద్యార్థులు చదువుతున్నారు కానీ విద్యార్థుల సంఖ్యకి తగినట్లుగా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల నాణ్యమైనటువంటి విద్యను అందించలేకపోతున్నారు కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ స్పందించి పైమండలాలతోపాటు ఉపాధ్యాయులు కొరత ఉన్న ఇతర మండలాలకు కూడా విద్యా వాలంటీర్ల నియామకం చెయ్యమని తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించడం జరిగినది. స్పందన తెలియజేసినందుకు కలెక్టర్ కి జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘం తరఫున ధన్యవాదాలు తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో వాల్మీకి ఉద్యోగ సంఘ అధ్యక్షులు మేడికొండ ఈశ్వర్ ప్రధాన కార్యదర్శి జె.ఎల్లస్వామి ఉపాధ్యక్షులు రంగన్న సవారన్న హరిబాబు మండ్ల నరసింహులు శంకరప్ప భాస్కర్ రాజ్ కుమార్ తిమ్మప్ప సాతర్ల రఘు రేపు రామకృష్ణ శంకరప్ప భీమేష్ సుంకన్న తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper